Tue Dec 24 2024 12:21:17 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించింది
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 27 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించింది. దేశంలో ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసులు 3,007కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు, ఢిల్లీలో 465, తెలంగాణలో 107 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ తో పాటు కరోనా కేసులు కూడా రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.
ఆంక్షలు పెట్టినా.....
ఇక తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీకెండ్ లాక్ డౌన్ నేటి నుంచి ఢిల్లీ, కర్ణాటకలో అమలవుతుంది. ఇక నైట్ కర్ఫ్యూను చాలా రోజుల నుంచి అమలు చేస్తున్నారు. అయినా ఒమిక్రాన్ కేసులు కట్టడి కావడం లేదు. దీంతో ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.
Next Story