Wed Jan 15 2025 17:57:08 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ కు తోడు కరోనా కేసులు పెరుగుతున్నాయ్
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్రలలో ఈ సంఖ్య ఎక్కువగా కన్పిస్తుంది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్రలలో ఈ సంఖ్య ఎక్కువగా కన్పిస్తుంది. ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రలో ఆంక్షలను పెంచారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించారు. మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
ఒక్కరోజులోనే.....
నిన్న ఒక్క రోజునే ఢిల్లీలో 38 శాతం కరోనా కేసులు పెరిగాయి. అలాగే మహారాష్ట్రలో పది శాతం కేసులు పెరిగియాి. ఢిల్లీలో 249, ముంబైలో 757 కేసులు నమోదవ్వడంతో కరోనా మరోసారి విజృంభిస్తుందన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు పర్చాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story