Tue Dec 24 2024 12:20:23 GMT+0000 (Coordinated Universal Time)
పెరుగుతున్న ఒమిక్రాన్... భారత్ లో వెయ్యికి చేరువలో
భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ట్రావెల్ హిస్టరీ లేని వాళ్లకు కూడా ఒమిక్రాన్ సోకడం ఆందోళన కల్గిస్తుంది
భారత్ లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ట్రావెల్ హిస్టరీ లేని వాళ్లకు కూడా ఒమిక్రాన్ సోకడం ఆందోళన కల్గిస్తుంది. విదేశాల నుంచి వచ్చే వారిని ఎయిర్ పోర్టులోనే పరీక్షలు జరిపి ఐసొలేషన్ కు తరలిస్తున్నప్పటికీ ఒమిక్రాన్ కేసుల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. తాజాగా భారత్ లో 945 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.
అత్యధికంగా....
వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర లో 252 కేసులకు చేరుకున్నాయి. ఇక ఢిల్లీలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ తో పాటు కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండంటంతో ఆ యా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలూ ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story