Fri Dec 27 2024 20:38:50 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ కు కొత్త వేరియంట్ టెన్షన్
భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఆందోళన కలిగిస్తుంది.వేగంగా వేరియంట్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు
భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అతి వేగంగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీపావళికి వరస సెలవులు రావడంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. రాబోయే రెండు మూడు వారాలు అత్యంత కీలకమని చెబుతున్నాయి. ఒక్కరోజులో 2,09,088 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 2,112 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
తగ్గిన యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా చికిత్స పొంది 4.40 కోట్ల కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 5,28,957 మంది మరణించారని అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు 0.01 శాతంగా నమోదయింది. రికవరీ రేటు శాతం 98.76 శాతంగా నమోదయిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో 24,043 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.05 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వకూ దేశంలో 219.53 కోట్లు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story