Mon Dec 23 2024 16:03:19 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఒమిక్రాన్ టెన్షన్.. 82 మందిలో వైరస్ లక్షణాలు ?
ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో భారీగా ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో సుమారు 82 మంది నుంచి సేకరించిన శాంపిల్స్ ను
దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకునే లోపే ఒమిక్రాన్ విజృంభిస్తోంది. నిన్న ఏపీలో రెండవ ఒమిక్రాన్ కేసు నమోదవ్వగా.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒమిక్రాన్ నిర్థారణ అయింది. వారిలో ఎవ్వరికీ విదేశాలకు వెళ్లొచ్చిన చరిత్ర లేదని అధికారులు తెలిపారు. ఇటు తెలంగాణలోనూ ఒమిక్రాన్ గుబులు రేపుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. దాంతో జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒమిక్రాన్ భయంతో ముస్తాబాద్ మండలంలోని గూడెంలో ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు.
82 మంది శాంపిల్స్ సేకరణ
ఇదిలా ఉండగా.. తమిళనాడులో ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో భారీగా ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో సుమారు 82 మంది నుంచి సేకరించిన శాంపిల్స్ ను వైద్య పరీక్షల నిమిత్తం బెంగళూరు ల్యాబ్ కు పంపించారు. వాటి ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. వీటిలో భారీగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశాలుండటంతో వారందరినీ కింగ్స్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తి ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్నాడని తెలిపారు.
సరిహద్దుల్లో వైద్య బృందాలు
బుధవారం టాంజానియా నుంచి నెల్లైకు వచ్చిన ఓ యువకుడిలోనూ ఒమిక్రాన్ లక్షణాలు కనిపించాయి. అలాగే ఇటీవలే కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వెళ్లిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ నిర్థారణ కావడంతో.. చెన్నై వైద్య సిబ్బంది అప్రమత్తమయిందది. తమిళనాడు సర్కార్ సైతం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అధికారులను అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించేలా సరిహద్దుల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేసింది స్టాలిన్ సర్కార్.
Next Story