Tue Nov 19 2024 05:43:52 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో 24కు చేరిన ఒమిక్రాన్ కేసులు
భారత్ కు కొత్తగా ఒమిక్రాన్ ముప్పు పొంచిఉన్నట్లే కన్పిస్తుంది. తాజాగా రాజస్థాన్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదయింది
భారత్ కు కరోనా టెన్షన్ వీడటం లేదు. కొత్తగా ఒమిక్రాన్ ముప్పు పొంచిఉన్నట్లే కన్పిస్తుంది. తాజాగా రాజస్థాన్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదయింది. దీంతో భారత్ లో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 24కు చేరుకుంది. ఎయిర్ పోర్టుల్లో నిఘాను మరింత తీవ్రతరం చేశారు. 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అక్కడే పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరిలిస్తున్నారు. రోజుకు రెండు, మూడు ఒమిక్రాన్ కేసులు బయటపడతుండటం ఆందోళన కల్గిస్తుంది.
ఐదు రాష్ట్రాల్లో...
ఇప్పటి వరకూ ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. రాజస్థాన్ లో పది, మహారాష్ట్రలో పది, కర్ణాటకలో రెండు, ఢిల్లీలో ఒకటి, గుజరాత్ లో ఒక కేసు నమోదయింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా ఈ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు, పరీక్షలు మరింత ముమ్మరం చేశారు.
Next Story