Mon Nov 18 2024 13:42:19 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు 25 రాష్ట్రాలకు విస్తరించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 266 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,215కు చేరుకుంది.
ఈ రాష్ట్రాలకు అలెర్ట్....
ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేస్తున్నా, రిస్క్ దేశాల విమానాలపై నిషేధం విధించినా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక తాజాగా మహారాష్ట్రలో 653, ఢిల్లీలో 382, కేరళలో 226, గుజరాత్ లో 154, రాజస్థాన్ లో 174, తమిళనాడులో 121, తెలంగాణలో 94 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.
Next Story