Mon Nov 18 2024 17:51:02 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో విస్తరిస్తున్న ఒమిక్రాన్
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దాదాపు 19 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది.
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దాదాపు 19 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది. ఎన్ని ఆంక్షలు విధించినా కేసుల సంఖ్యమాత్రం తగ్గకపోవడం ఆందోళన కల్గిస్తుంది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేవలం ఆ దేశం నుంచి మాత్రమే కాకుండా రిస్క్ దేశాల నుంచి కూడా వ్యాప్తి చెందుతుంది. దీంతో 12 దేశాలను తొలుత రిస్క్ దేశాలుగా భారత్ ప్రభుత్వం గుర్తించి అక్కడి నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
19 రాష్ట్రాల్లో....
అయితే అన్ని దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించడంతో ఇప్పుడు వైద్య పరీక్షలు విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి నిర్వహిస్తున్నారు. భారత్ లో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 530 కి చేరింది. మొన్నటివరకూ 17 రాష్ట్రాలకే పరిమితం కాగా, మరో రెండు రాష్ట్రాలు ఆ జాబితాలో వచ్చి చేరాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లోనూ తొలిసారి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఆంక్షలు విధించినా....
ఇప్పటి వరకూ భారత్ లో 530 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాగా, ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 141 కేసులున్నాయి. తర్వాత ఢిల్లీలో 79, కేరళలో 57, గుజరాత్ లో 49, తెలంగాణలో 44, ఆంధ్రప్రదేశ్ లో ఆరు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమయి ఆంక్షలు విధించాయి. న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ ను విధించాయి.
Next Story