Thu Apr 24 2025 02:16:10 GMT+0000 (Coordinated Universal Time)
భార్యకు ముద్దు పెట్టినందుకు చితక్కొట్టారు
భార్య ఆ గుంపును ఆపడానికి ప్రయత్నించినా.. ఆమె మాటలను ఎవరూ వినలేదు.

అయోధ్యలోని రామ్ కి పైడిలో తన భార్యను ముద్దుపెట్టుకున్నందుకు కోపోద్రిక్తులైన వర్గం ఒక వ్యక్తిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఈ జంట ఘాట్లో స్నానం చేస్తూ ఉండగా.. ఆ గుంపు వారిని చుట్టుముట్టడం ప్రారంభించింది. కొన్ని సెకన్ల తర్వాత, ఒక వ్యక్తి భర్తను ఈడ్చుకెళ్లి కొట్టడం ప్రారంభించాడు. భార్య ఆ గుంపును ఆపడానికి ప్రయత్నించినా.. ఆమె మాటలను ఎవరూ వినలేదు.
నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను జనం కొట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరయు నదిలో ముద్దు పెట్టుకున్న భర్తను జనం కొట్టారు. భార్యముందే భర్తను చితక్కొట్టారు. సరయూ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అదే సమయంలో ఓ జంట స్నానం చేసేందుకు నదిలోకి దిగింది. ఆ జంట ముద్దు పెట్టుకుంది. ఇలా చేయడంతో చుట్టుపక్కల వాళ్లకు పిచ్చ కోపం వచ్చింది. పవిత్రమైన ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటారా అని ఆ భర్తను బయటకు లాగి మరీ కొట్టారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు అయోధ్య పోలీసులు తెలిపారు.అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP), శైలేష్ పాండే మాట్లాడుతూ, ఈ వీడియో వారం క్రితం చోటు చేసుకుందని.. ఈ విషయంలో తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ జంట ఎక్కడ నివాసం ఉంటున్నారో కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
News Summary - Angry mob beats man for kissing wife in Ayodhya ghat
Next Story