Mon Dec 23 2024 02:34:25 GMT+0000 (Coordinated Universal Time)
వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన 300 జంటలు
డిసెంబర్ 4, 5 తేదీల్లో గుజరాత్ లోని సూరత్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో 300 జంటలు ఒక్కటయ్యాయి.
డిసెంబర్ 4, 5 తేదీల్లో గుజరాత్ లోని సూరత్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో 300 జంటలు ఒక్కటయ్యాయి. వేద మంత్రాల సాక్షిగా.. ఆ జంటలన్నీ ఏడడుగులు వేశాయి. ఎంతో సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టినీ ఆకర్షించింది. పీపీ సవానీ గ్రూప్ అధినేత మహేశ్ సవానీ ప్రతి ఏటా ఈ సామూహిక వివాహాలను జరిపిస్తుంటారు.
నాలుగు వేలకు పైగా...
మహేశ్ సవానీ చొరవతో ఈ ఏడాది కూడా వందల జంటలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్ సవానీ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తమ ఆధ్వర్యంలో 4 వేలకు పైగా జంటలకు పెళ్లిళ్లు జరిపించామని, 4 వేల మందికి పైగా ఆడపిల్లలకు తాను పెంపుడు తండ్రిగా మారి కన్యాదానం జరిపించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, చాలా గర్వంగా కూడా ఉందని పేర్కొన్నారు.
Next Story