Mon Dec 23 2024 06:56:10 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రవాదుల టార్గెట్.. అప్రమత్తమయిన కేంద్రం
ఈ నెల 26న ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న రిపబ్లిక్ వేడుకలు జరగనున్నాయి
ఈ నెల 26న ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న రిపబ్లిక్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే అతిధులపైనా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశాలున్నాయి. డ్రోన్ ల ద్వారా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటలిజెన్స్ రిపోర్టు పేర్కొంది. దీంతో పాటు ప్రసిద్ధ కట్టడాలు, జనరద్దీ ప్రాంతాల్లో దాడులకు తెగబడే అవకాశముందని పేర్కొంది.
కేంద్ర బలగాలు...
దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. పంజాబ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కేంద్ర బలగాలు రంగంలోకి దించారు. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్ , హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులు దాడికి తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ రిపోర్ట్ లో పేర్కొంది.
- Tags
- terrorists
- modi
Next Story