Sun Nov 17 2024 22:30:06 GMT+0000 (Coordinated Universal Time)
పండగ పూట పసిడి ప్రియులకు షాకింగ్
దసరా పండగ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ప్రియులకు షాకిచ్చాయి. వెండి కూడా అదే బాటలో పయనించింది.
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం అంటే భారతీయులకు మహా ప్రియ. తమ కుటుంబంలో ఒక వస్తువుగా దానిని ఇముడ్చుకున్నారు. బంగారంతో మేనికి మరింత సొగసులబ్బుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. ఎప్పటికప్పుడు బంగారం ధరలు పెరుగుతుండటమే కాని తగ్గడం చాలా అరుదు. బంగారం ధరలు తగ్గినా స్వల్పంగా మాత్రమే తగ్గుతాయి. పెరిగితే మాత్రం భారీగా పెరుగుతాయి. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
వెండి ధరలు కూడా...
దేశంలో దసరా పండగ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ప్రియులకు షాకిచ్చాయి. వెండి కూడా అదే బాటలో పయనించింది. పది గ్రాముల బంగారంపై రూ.500 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 51,660 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,350 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండ ధర హైదరాబాద్ లో 66,700 రూపాయలుగా ఉంది
Next Story