Sun Nov 17 2024 12:38:09 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజూ పసిడిప్రియులకు గుడ్ న్యూస్
రెండో రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి
బంగారం అంటేనే అంత. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినా భారతీయ సంస్కృతిలో భాగం కావడంతో బంగారాన్ని కొనుగోలు చేయడం తప్పని సరి కావడంతో ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.
పెరిగిన వెండి ధర...
తాజాగా రెండో రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. వెండి కిలో పై ఐదు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,970 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,550 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం 67,500 రూపాయలకు చేరుకుంది.
Next Story