Sun Dec 22 2024 22:25:26 GMT+0000 (Coordinated Universal Time)
Time Square : టైమ్ స్క్కేర్ లో అయోధ్య లైవ్
అయోధ్యలో జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని న్యూయార్క్ లోని టైమ్ స్క్కేర్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
అయోధ్య రామమందిరం లో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈ నెల 22వ తేదీన జరగనుంది. అయితే ఈ కార్యక్రమం కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. దేశం మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆరోజు అయోధ్య చేరుకోలేని వాళ్లకు టీవీల ద్వారా లైవ్ ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ శంకుస్థాపన చేయనున్నారు.
టైమ్ స్క్కేర్ లో...
అయితే అయోధ్యలో జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్ స్క్కేర్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అమెరికాలోని టైమ్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలతో పాటు కాన్సులేట్ కార్యాలయాలలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మోదీ ప్రసంగం కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story