Mon Dec 23 2024 10:49:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక సమావేశం
ప్రతిపక్షాలు నేడు కీలక సమావేశం నిర్వహించబోతున్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమావేశం జరగనుంది
ప్రతిపక్షాలు నేడు కీలక సమావేశం నిర్వహించబోతున్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన విపక్షాల సమావేశం జరగనుంది. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హతవేటు వేయడంపై విపక్షాలతో కలసి దేశ వ్యాప్తంగా ఆందోళన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో ఈ మేరకు వారితో సమావేశాలు నిర్వహిస్తుంది.
విపక్షాలతో కలసి...
ఇప్పటికే దశల వారీగా కాంగ్రెస్ పోరాటాలు ప్రారంభించింది. సత్యాగ్రహ దీక్షలతో పాటు రోడ్డు మీదకు వచ్చి రాహుల్ పై అనర్హత వేటును పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో విపక్షాలు కూడా ఈ ఘటనను ఖండిస్తున్నాయి. కాంగ్రెస్ తో కలసి పోరాటం చేసేందుకు ముందుకు రానున్నాయి.
Next Story