Sun Mar 16 2025 23:47:03 GMT+0000 (Coordinated Universal Time)
ఇవేం ధరలు.. దిగిపోండి
ధరల పెరుగుదలపై విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ధరల పెరుగుదలపై విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విపక్షాల ఆందోళనలతో లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పై విపక్షాలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగాయి. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గ్యాస్ ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా ప్రభుత్వం పెంచిందని, నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని విపక్ష నేతలు ఆరోపించారు.
జీఎస్టీ విధింపుపై....
పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర తమ నిరసనను విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. నిత్యావసరాలపై ఐదు శాతం జీఎస్టీ విధించడాన్ని కూడా విపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం సామాన్యుడిని బతకనివ్వకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు. ధరలను అదుపు చేయలేకపోతే అధికారం నుంచి దిగిపోవాలని నేతలు కోరారు.
Next Story