Mon Dec 23 2024 10:45:42 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : నేడు ఢిల్లీలో విపక్షాల ర్యాలీ
ఢిల్లీలో నేడు విపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించనున్నాయి. సేవ్ డెమొక్రసీ పేరుతో ఈ ర్యాలీ సాగనుంది
ఢిల్లీలో నేడు విపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించనున్నాయి. సేవ్ డెమొక్రసీ పేరుతో ఈ ర్యాలీ సాగనుంది. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట ప్రభుత్వం విపక్షాలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇటీవల ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు.
కాంగ్రెస్ ఖాతాల జప్తు...
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు పంపడం, బ్యాంకు ఖాతాలను జప్తు చేయడం వంటివి చేస్తూ ఎన్నికల్లో ఏకపక్ష గెలుపుకోసం మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఢిల్లీలో పెద్దయెత్తున ర్యాలీకి విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story