Mon Dec 23 2024 18:44:07 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీకి విపక్షాల లేఖ.. ఏముందంటే?
ప్రధాని మోదీకి ప్రతిపక్షాలు లేఖ రాశాయి. మనీష్ సీసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు
ప్రధాని మోదీకి ప్రతిపక్షాలు లేఖ రాశాయి. మనీష్ సీసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అక్రమంగా అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్ఎస్తో పాటు తొమ్మిది పార్టీల నేతల సంతకాలు చేసి ప్రధాని లేఖకు రాశారు. సీబీఐని ఉపయోగించి ఈ దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. గవర్నర్ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు.
బీఆర్ఎస్తో పాటు...
ఈ లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, శరద్ పవార్, తేజస్వియాదవ్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఉద్ధవ్ థాక్రే వంటి వారు సంతకాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఘాటుగా ఈసారి ప్రధానికి విపక్షాలు లేఖ రాశాయి. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమే అనిపించుకుంటుందని లేఖలో అభిప్రాయపడ్డారు.
- Tags
- modi
- opposition
Next Story