Mon Dec 23 2024 04:30:03 GMT+0000 (Coordinated Universal Time)
ఆఫీసులో ఇక బీరు కొట్టేయొచ్చు
హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. కార్పొరేట్ కార్యాలయాలలో మద్యం తాగేందుకు అనుమతిచ్చింది
హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. కార్పొరేట్ కార్యాలయాలకు చెందిన క్యాంటిన్లలో మద్యం తాగేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఏడాది మద్యం పాలసీ ద్వారా కార్పొరేట్ ఆఫీసుల్లో మద్యం తాగేందుకు వీలుకల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హర్యానా సర్కార్...
అయితే ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న బీరు, వైన్ వంటివి మాత్రమే తాగేందుకు అనుమతించింది. వచ్చే నెల 12వ తేదీనుంచి ఈ సదుపాయం అమలులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయిదువేల కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలతో పాటు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలకే ఈ సదుపాయం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Next Story