Sun Dec 22 2024 22:10:17 GMT+0000 (Coordinated Universal Time)
Parliament : ఢిల్లీ పార్లమెంటులో దాడిలో నిందితుడిని పట్టుకున్న వైసీపీ ఎంపీ
పార్లమెంటులో దాడి చేసిన వారిని పట్టుకున్న వారిలో మన తెలుగు పార్లమెంటు సభ్యుడు ఉన్నారు
పార్లమెంటులో దాడి చేసిన వారిని పట్టుకున్న వారిలో మన తెలుగు పార్లమెంటు సభ్యుడు ఉన్నారు. హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ నిందితులో ఒకరిని పార్లమెంటులో పట్టుకున్నారు. విజిటర్స్ గ్యాలరీలో నుంచి దూకిన వెంటనే పార్లమెంటు సభ్యులు భయపడి బయటకు పరుగులు తీశారు. అయితే అందులో కొందరు ఎంపీలు ధైర్యం చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఒకరు.
నిందితుల్లో ఒకరిని...
గోరంట్ల మాధవ్ నిందితుల్లో ఒకరిని వెనక నుంచి పట్టుకుని రెక్కలు విరిచి పోలీసులకు అప్పగించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారు. ఆ అనుభవం ఇప్పుడు పనిచేసింది. విజటర్స్ గ్యాలరీ నుంచి దూకిన వెంటనే సభలోనే ఉన్న గోరంట్ల మాధవ్ వారి వద్ద ఏవైనా మారణాయుధాలున్నాయా? అన్నది పరిశీలించారు. నిందితులు ఎంపీలు కూర్చునే వాటిపై గెంతులు వేస్తూ కేకలు వేస్తుండటంతో వెంటనే వారిలో ఒకరిని గోరంట్ల మాధవ్ ఒడిసి పట్టుకున్నారు. ప్రస్తుం వైసీపీ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ గతంలో తాను పోలీసు అధికారిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు పనికొచ్చిందని చెప్పారు.
Next Story