Fri Nov 22 2024 15:37:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల తిరుగుబాటు అందుకేనట
శివసేన ఎమ్మెల్యేలు 56 మందిలో ఇప్పుడు ఉద్ధవ్ వర్గంలో ఉంది 13 మందే. తక్కువ స్థాయిలో క ఉండటానికి అనేక కారణాలున్నాయి
శివసేన ఎమ్మెల్యేలు 56 మందిలో ఇప్పుడు ఉద్ధవ్ వర్గంలో ఉంది 13 మందే. అంత తక్కువ స్థాయిలో ఉద్ధవ్ వెనక ఉండటానికి అనేక కారణాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి శివసేన పోటీ చేసింది. బీజేపీ ఓట్లన్నీ శివసేనకే గత ఎన్నికల్లో పడ్డాయి. గత ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ లేదా ఎన్సీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. శివసేన, బీజేపీ కలిస్తేనే తాము గెలిచామన్న నమ్మకం ఎక్కువ మంది ఎమ్మెల్యేల్లో ఉంది.
వచ్చే ఎన్నికలకు....
ీఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తాము బీజేపీ అభ్యర్థితో తలపడాల్సి వస్తుంది. మరోసారి గెలుపు సాధ్యం కాదు. ఈ కారణం చేత కూడా అనేక మంది శివసేన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రత్యర్థిగా బీజేపీ ఉండకూడదనే వారు భావించినట్లు తెలిసింది. అందుకే ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సయితం ఏక్నాధ్ షిండే కు మద్దతుగా వెళ్లారన్న వాదన కూడా విన్పిస్తుంది. అందుకే కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి శివసేన బయటకు రావాలన్నది షిండే శిబిరం ప్రధాన డిమాండ్ గా ఉందంటున్నారు.
Next Story