Tue Jan 07 2025 08:20:16 GMT+0000 (Coordinated Universal Time)
OYO : ఓయూ రూముల్లో వారికి ఇక నో ఛాన్స్
ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వడం లేదని ప్రకటించింది
ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వడం లేదని ప్రకటించింది. ఇక పై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ ఓయో తేల్చిచెప్పింది. ఈమేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్స్ ను ఓయో అడగనుంది.
ఐడీ ప్రూఫ్స్ లేకుంటే...
సరైన ఐడి ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో తెలిపింది. మొదటగా మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. సో.. పెళ్లయితేనే ఓయో రూములు ఇకపై అద్దెకు ఇస్తారు. పెళ్లి కాని వారికి మాత్రం ఇక ఓయో రూములు అందుబాటులో ఉండవన్న మాట.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story