Mon Dec 23 2024 06:44:20 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరీ సీమా.. ఆమెను పంపకపోతే ఉగ్రదాడులా?
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కు పబ్ జీ గేమ్ ద్వారా భారత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భారత్ లో ఉన్న ప్రియుడిని చేరుకోవడం
పబ్ జీ గేమ్ ద్వారా భారత్ వ్యక్తికి పరిచయమైన సీమా అనే పాకిస్థాన్ మహిళను భారత్ నుండి పంపించేయాలని బెదిరింపులు వస్తున్నాయి. ఆమెను పాక్ కు పంపించకపోతే ఉగ్రదాడులు తెగబడతామని హెచ్చరించారు. అది కూడా పోలీసులకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు దిగారు.
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కు పబ్ జీ గేమ్ ద్వారా భారత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భారత్ లో ఉన్న ప్రియుడిని చేరుకోవడం కోసం సీమా మొదట నేపాల్ కు చేరింది. అక్కడి నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. అలా వారిద్దరూ నలుగురు పిల్లలతో కలిసి మే నెల నుంచి ఓ అపార్ట్మెంట్ లో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సీమా వయసు 27 సంవత్సరాలు కాగా సచిన్ వయసు 22 సంవత్సరాలు. రబుపురాలోని ఒక ఇంట్లో నివసిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు సచిన్, సీమాలను అరెస్టు చేశారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ భారత్ లో అక్రమంగా ప్రవేశించినందుకు గాను సీమా హైదర్ ను, ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు 22 ఏళ్ల సచిన్ మీనా, అతని తండ్రిని గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరు ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీమా హైదర్ తాను ఇక్కడే సచిన్ తో ఉంటానని అంటోంది.
అయితే పాక్ కు చెందిన ఆమెను తిరిగి తమ దేశానికి పంపించాలని, లేదంటే 26/11 తరహా ఉగ్రవాద దాడి పునరావృతమవుతుందని ముంబై పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఉర్దూలో అతడు బెదిరింపులకు దిగాడు. ఈ కాల్ ఎవరు చేశారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Next Story