Mon Dec 23 2024 11:13:41 GMT+0000 (Coordinated Universal Time)
పాన్ - ఆధార్ లింక్ చలాన్ రావట్లేదా ? ఐటీ శాఖ ఏం చెప్పిందో చూడండి
ఈ నేపథ్యంలో ఐటీశాఖ ఆధార్ - పాన్ లింక్ పై కీలక ప్రకటన చేసింది. ఆధార్-పాన్ లింక్ చేసుకునేందుకు చెల్లింపులు చేసిన తర్వాత..
పాన్ కార్డును - ఆధార్ కార్డుతో ఫ్రీ గా లింక్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్ 30తో ముగిసింది. ఇంకా లింక్ చేసుకోని వారు అందుకు తగిన ఫీజు చెల్లించి లింక్ చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఐటీశాఖ ఆధార్ - పాన్ లింక్ పై కీలక ప్రకటన చేసింది. ఆధార్-పాన్ లింక్ చేసుకునేందుకు చెల్లింపులు చేసిన తర్వాత.. కొందరు వినియోగదారులు చలాన్ డౌన్ లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అయితే.. చలాన్ డౌన్ లోడ్ కాని పక్షంలో.. లింక్ చేసుకునేందుకు చెల్లింపులు చేసిన తర్వాత ఐటీ వెబ్ సైట్ లో లాగిన్ చేసి ఈ-పే ట్యాక్స్ సెక్షన్ లో చెల్లింపు పూర్తయిందా ? లేదా? చూసుకోవచ్చని సూచించింది.
అక్కడ చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు చూపిస్తే.. ఆధార్ - పాన్ లింక్ చేసుకోవచ్చని పేర్కొంది. చలాన్ డౌన్ లోడ్ చేసుకోవడం తప్పనిసరి కాదని ఐటీశాఖ స్పష్టం చేసింది. చెల్లింపు పూర్తయ్యాక పాన్ కార్డు హోల్డర్స్ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ కు చలాన్ చెల్లింపులకు సంబంధించిన రశీదు కాపీ వస్తుందని వివరించింది. నగదు చెల్లింపు పూర్తయ్యాక కూడా ఆధార్ - పాన్ లింక్ ప్రక్రియ పూర్తి కాకపోతే.. వాటిని ఐటీశాఖ పరిగణలోకి తీసుకుంటుందని ఆదాయపన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికీ ఆధార్ - పాన్ కార్డు లింక్ చేసుకోని వారు జులై 30వ తేదీ లోపు తగిన ఫీజు చెల్లించి లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
Next Story