Mon Dec 23 2024 08:20:29 GMT+0000 (Coordinated Universal Time)
వీగిపోయిన అవిశ్వాసం
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్‌సభలో విపక్షాల వాకౌట్ చేయడంతో ఓటింగ్ లేకుండానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోకసభలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష I.N.D.I.A. కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గురువారం సాయంత్రం మూజువాణి ఓటుతోనే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్ సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. ప్రధాని మాట్లాడుతుండగా ఓటింగ్‌కు ముందే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి.
కాంగ్రెస్‌పై అన్ని రాష్ట్రాల ప్రజలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించారని ఈరోజు మాట్లాడుతూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. విపక్షాలు ఇండియాను I.N.D.I.Aగా ముక్కలు చేశాయన్నారు. NDAలో రెండు ‘‘ I ’’లు చేర్చారని .. మొదటి I అంటే 26 పార్టీల అహంకారమని, రెండవ I అంటే ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతీ పథకం పేరు వెనుక కాంగ్రెస్ ఒక కుటుంబం పేరు చేర్చిందని ఎద్దేవా చేశారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారని ప్రధాని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అది ఘమండియా కూటమి అని అభివర్ణించారు మోదీ. మణిపూర్‌పై అర్ధవంతమైన చర్చ జరిపే ఉద్దేశం విపక్షాలకు లేదన్నారు. వీళ్ల చర్చలో అసలు విషయమే లేదంటూ మోదీ విమర్శించారు. తాము చర్చకు ఆహ్వానించామని.. కానీ విపక్షాలు చర్చలకు రావడం లేదన్నారు. మోదీ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.
Next Story