Mon Dec 23 2024 11:23:19 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17న అఖిలపక్ష సమావేశం జరగనుంది.
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17న అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 18న ప్రారంభమవుతాయి. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు, అజెండా గురించి అఖిలపక్ష సమావేశంలో వివరించి సహకరించాలని పార్లమెంటరీ పార్టీ నేతలుకోరనున్నారు. 16వ తేదీన స్పీకర్ ఓం బిర్లా లోక్సభ పక్ష నేతలతో సమావేశమై సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరనున్నారు.
వెంకయ్యకు...
రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ సాయంత్రం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అన్ని పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. కాగా ఈ వర్షాకాల సమావేశాలు వెంకయ్యనాయుడికి చివరి సమావేశాలు. వచ్చే నెల 10వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6వ తేదీన జరగనుంది. వెంకయ్యనాయుడును తిరిగి ఉపరాష్ట్రపతిగా కొనసాగిస్తారా? లేదా? అన్నది ఈ నెల 16వ తేదీన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డుసమావేశంలో తెలియనుంది.
Next Story