Wed Jan 15 2025 11:47:33 GMT+0000 (Coordinated Universal Time)
సాయంత్రం వేళల్లో లోక్ సభ
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా తీవ్రత కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా తీవ్రత కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు, రాజ్యసభ సమావేశలాలను విడివిడిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఒకేసారి ఉభయ సభలు సమావేశమైతే కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన కేంద్ర ప్రభుత్వం వేర్వేరు సమయాల్లో ఉభయ సభలను సమావేశ పర్చాలని నిర్ణయించింది.
వేర్వేరు సమయాల్లో.....
ఉదయం పది గంటల నంచి సాయంత్రం మూడు గంటల వరకూ రాజ్యసభను నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లోక్ సభను నిర్వహిస్తారు. ఈ మేరకు లోక్ సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఒక్క ఫిబ్రవరి ఒకటో తేది బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నందున ఆరోజు లోక్ సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం అవుతుంది. రెండో తేదీ నుంచి సాయంత్రం నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా కోవిడ్ నిబంధనల మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story