Fri Dec 27 2024 03:20:06 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు సమావేశాలు నేటి తో ముగియనున్నాయి. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది
పార్లమెంటు సమావేశాలు నేటి తో ముగియనున్నాయి. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది. అయితే చివరి రోజు అయోధ్య అంశంపై చర్చించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంపై లోక్సభలో చర్చను బీజేపీ నేత సత్యపాల్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం తెలిపింది.
అయోధ్య రామాలయ నిర్మాణంపై...
అయోధ్య నిర్మాణం పూర్తికావడం, బాల రాముడి ప్రతిష్ట దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వీక్షించడం వంటి అంశాలను సభ్యులు ప్రస్తావించనున్నారు. ప్రధాన మోదీని అయోధ్య రామమందిర నిర్మాణానికి చేసిన కృషిని సభ్యులు ప్రశంసించనున్నారు. ఈరోజు సమావేశాలకు చివరి రోజు కావడంతో సభ్యులు విధిగా అందరూ హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి రోజు సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story