Mon Dec 23 2024 10:28:54 GMT+0000 (Coordinated Universal Time)
ఇది సరికాదు.. ప్రధానికి సోనియా లేఖపై మంత్రి ప్రహ్లద్ జోషి కౌంటర్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఏజెండాపై సస్పెన్స్ కొనసాగుతోంది. తమను సంప్రదించకుండా సమావేశాలను ఖరారు చేశారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారరు. అయితే సోనియా గాంధీ లేఖపై స్పందించారు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఏజెండాపై సస్పెన్స్ కొనసాగుతోంది. తమను సంప్రదించకుండా సమావేశాలను ఖరారు చేశారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారరు. అయితే సోనియా గాంధీ లేఖపై స్పందించారు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి. మీరు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏజెండా గురించి చెప్పలేదని సోనియాకు కౌంటర్ ఇచ్చారు.ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. 18న పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహించి.. గణేశ్ చవితి సందర్భంగా ఈనెల 19 నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. జమిలి ఎన్నికల బిల్లు, కామన్ సివిల్ కోడ్ బిల్లు..మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రత్యేక సమావేశాల వెనుక ఎజెండా ఏంటో చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదేవిషయంసై సోనియా గాంధీ అయితే ప్రధానికి లేఖ కూడా రాయడం రాజకీయాలలో చర్చ జరిగింది. ధరల పెరుగుదల, దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతులకు ఎంఎస్పీ, ఆదానీ లావాదేవీలపై జేపీఎస్ ఏర్పాటు, మణిపూర్‌లో రాజ్యాంగ వ్యవస్థ వైఫల్యంపై చర్చ, హర్యానాలో మతఘర్షణలు, చైనా ఆక్రమణలు, కుల ఆధారిత జనాభా లెక్కలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, కరువు, వరదల ప్రభావంపై చర్చించాలని రెండు పేజీల లేఖలో సోనియా గాంధీ కోరారు. అయితే సమావేశాలకు ముందు ఏజెండాను వెల్లడించే సాంప్రదాయం ఎప్పుడు లేదని సోనియా లేఖకు జవాబు ఇచ్చారు ప్రహ్లాద్ జోషి. కాంగ్రెస్ , ఇతర పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏజెండాను ముందు ప్రకటించలేదు. సమావేశాల కంటే ముందు ఏజెండాను విడుదల చేయలేదు. దీనికి రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం అంటూ వ్యాఖ్యనించారు ప్రహ్లాద్ జోషి.
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును కూడా రాజకీయం చేయాలని, వివాదాలు లేని చోట అనవసర వివాదాలు సృష్టించాలని ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఆర్టికల్ 85 ప్రకారం.. రాజ్యాంగ ఆదేశాన్ని అనుసరించి పార్లమెంటు సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయని, ఈ విషయం కూడా మీకు తెలుసని ప్రహ్లాద్ జోషి గుర్తు చేశారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందిన వెంటనే, సెప్టెంబర్ 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారని, పార్లమెంటు సమావేశాలను నిర్వహించే ముందు రాజకీయ పార్టీలు ఎప్పుడూ చర్చించడం ఉండదని అన్నారు. రాష్ట్రపతి సమావేశాన్ని పిలిచిన తర్వాత, అలాగే సెషన్ ప్రారంభానికి ముందు, అన్ని పార్టీల నాయకుల సమావేశం జరుగుతుందని, పార్లమెంటులో తలెత్తే సమస్యల గురించి సభలో చర్చించడం జరుగుతుందని సోనియా లేఖపై క్లారిటీ ఇచ్చారు మంత్రి.
సమస్యలపై చర్చించేందుకు ఎప్పుడు సిద్దమే:
కాగా, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మీరు ప్రస్తావించిన అంశాలన్నీ లేవనెత్తగా, వాటిపై ప్రభుత్వం కూడా సమాధానమిచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా సమస్యల పరిష్కారం కోసం సభలో చర్చించేందుకు సిద్ధమేనని అన్నారు.
పార్లమెంట్ రాజకీయ వివాదాలకు వేదిక కాదు:
అయితే పార్లమెంట్ దేవాలయంతో సమానమని, పార్లమెంట్ రాజకీయ వివాదాలకు వేదిక కాదని అన్నారు. ఇది కాకుండా, రాబోయే సెషన్‌ను సజావుగా సాగేందుకు మీ పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. సభ సజావుగా సాగితే సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించుకునేందుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం దేశం పేరును ఇండియా స్థానంలో భారత్‌గా మారుస్తూ తీర్మానం చేయబోతోందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యాంగ సవరణలు కూడా చేపడతారని, ఇంకా ఎన్నో సంచలనాలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆసక్తికర అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి.
Next Story