Sat Apr 05 2025 05:51:30 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల తేదీలను ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి వెల్లడించారు

పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల తేదీలను ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకూ ఒక విడత పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. తిరిగి మార్చి 13 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకూ రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.
రాష్ట్రాల ఎన్నికలుండటంతో...
ఈ మేరకు ప్రహ్లద్ జోషి ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ ఏడాది అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఉండటంతో బడ్జెట్ ఎలాగుంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది. దీనిపై కసరత్తులు కూడా పూర్తయినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచేలా బడ్జెట్ ను రూపొందిస్తారంటున్నారు.
Next Story