Wed Apr 02 2025 16:06:06 GMT+0000 (Coordinated Universal Time)
శరద్ పవార్ రాజీనామాకు నో
శరద్ పవార్ రాజీనామాను పార్టీ నేతలు తిరస్కరించారు. ఈ మేరకు ఎన్సీపీ కోర్ కమిటీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

శరద్ పవార్ రాజీనామాను పార్టీ నేతలు తిరస్కరించారు. ఈ మేరకు ఎన్సీపీ కోర్ కమిటీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అనిశ్చితి నెలకొంది. బీజేపీలో కలిసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచరామూ పెద్దయెత్తున జరిగింది.
కోర్ కమిటీ...
అయితే సమావేశమైన ఎన్సీపీ కోర్ కమిటీ మాత్రం ఎన్సీపీ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగించాలని తీర్మానించింది. ఆయన రాజీనామాను ఆమోదించే ప్రసక్తి లేదని తెలిపింది. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ఎవరూ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. దీంతో కోర్ కమిటీ కూడా శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ తీర్మానం చేసింది.
Next Story