Mon Dec 23 2024 11:53:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కాంగ్రెస్ కు ఊహించని షాక్.. ఒక్క పైసా లేకుండా?
లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చెందిన అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు
లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చెందిన అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ కు చెందిన బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయడం కక్ష సాధింపు చర్య మాత్రమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ ఈ విషయం మీడియాకు తెలిపారు.
అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయంటూ...
పార్టీ కోశాధికారిగా ఉన్న అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్లు ఫ్రీజ్ అయినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అనుబంధ సంఘాలకు చెందిన అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయ్యాయని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే ఎవరు? ఎందుకు? అకౌంట్లను ఫ్రీజ్ చేశారన్నది మాత్రం తెలియరాలేదు.
Next Story