Sun Apr 06 2025 10:15:17 GMT+0000 (Coordinated Universal Time)
విమాన టిక్కెట్లను ఇలా
ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకునే వీలుంది

ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్సైట్ నుంచి టికెట్ బుకింగ్ చేసుకునే వీలుంది. ఈ మేరకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వెబ్సైట్ నుంచి...
సోమవారం నుంచి ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది అక్టోబరులో ఎయిర్ ఏషియాలో వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఈ ఏడాది మొదట్లో రెండు కంపెనీల బాధ్యతలను ఒకే సీఈవో పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఒకే వెబ్సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందని, ప్రయాణికులు ఇది గమనించి బుక్ చేసుకోవాలని కోరింది.
Next Story