Wed Apr 16 2025 13:56:36 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే పవన్ కళ్యాణ్ వెళ్లారట.. ఎందుకంత స్పెషల్
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని..

ఎన్డీయే(నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు జరగనున్న ఈ భేటీకి 38 పార్టీలు హాజరు కానున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుండి కేవలం జనసేనకి మాత్రమే ఆహ్వానం అందింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని.. ఈ అవకాశం కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని.. ఆ సమయంలో కలిశానని, 2019లో వేర్వేరుగా పోటీ చేశామని గుర్తు చేశారు. మంగళవారం నాటి భేటీ కోసం బీజేపీ సీనియర్ నాయకులు తనను ఆహ్వానించారని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై ఈ భేటీలో చర్చిస్తామన్నారు. ఎన్డీయే విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలనే అంశంపైనా చర్చిస్తామన్నారు.
ప్రతిపక్షాలు బెంగుళూరు వేదికగా సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి బల ప్రదర్శనకు సిద్ధమమైంది. మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే కూటమి భేటీ కానుంది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరు కానున్నాయని బీజేపీ ప్రకటించింది. బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే పరిధి క్రమంగా పెరుగుతోందన్నారు.
Next Story