Sun Dec 22 2024 21:06:45 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజుల వ్యవధిలో రెండో భూకంపం
ఉత్తరాఖండ్‌లో ప్రజలు వణుకుతున్నారు. వరస భూప్రకంపనలతో భయపడిపోతున్నారు. మూడు రోజుల్లో రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయి.
ఉత్తరాఖండ్‌లో ప్రజలు వణుకుతున్నారు. వరస భూప్రకంపనలతో భయపడిపోతున్నారు. మూడు రోజుల్లో రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరకాశీలో భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూమి కంపించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్ జిల్లాలో భూమి కంపించింది. ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 2.4 తీవ్రత కనిపించింది. దీంతో ప్రజలు వణికిపోయారు.
ఉత్తరకాశీలో...
ఇది మరిచిపోక ముందే ఉత్తరకాశీలో భూమి కంపించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర కాశీలో కంపించిన భూమితో ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వరసగా భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయపడి పోతున్నారు.
Next Story