Mon Dec 23 2024 03:59:32 GMT+0000 (Coordinated Universal Time)
Haryana :అసలు.. ఇక్కడ ఏమి జరుగుతోందో తెలుసా?
గోడల మీద పిల్లలు.. కింద పడితే ఇక అంతే సంగతులు. ఏమైనా ఫైర్
Haryana :గోడల మీద పిల్లలు.. కింద పడితే ఇక అంతే సంగతులు. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో అలా కిటికీల నుండి బయటకు వస్తున్నారని అనుకుంటున్నారా? అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ జరుగుతోంది మాస్ కాపీయింగ్. హర్యానాలోని తౌరు ప్రాంతంలోని ఒక పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలో చీటింగ్ జరిగింది. 10వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు చిట్స్ పాస్ చేసేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు పాఠశాల గోడలు ఎక్కుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి.
ఈ ఘటన బుధవారం నుహ్ జిల్లాలోని తౌరులోని చంద్రావతి పాఠశాలలో చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పేపర్ లీక్ అయినట్లు సమాచారం.దీంతో విద్యార్థులతో పాటు వచ్చిన వ్యక్తులు పరీక్షా కేంద్రం భవనం గోడలు ఎక్కి చిట్టీలను పాస్ చేశారు. ఈ ఘటనపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ధరంపాల్ స్పందిస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షల్లో చీటింగ్ కు అవకాశం ఇవ్వమని తెలిపారు. కాపీయింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి సంఘటనలపై విద్యా మండలికి నివేదిస్తామని ధరంపాల్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వెలుపల పోలీసులను పెంచడానికి బోర్డు పోలీసు విభాగంతో మాట్లాడుతుందని ఆయన చెప్పారు.
Next Story