Mon Dec 23 2024 15:18:25 GMT+0000 (Coordinated Universal Time)
దేశ వ్యాప్తంగా తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు.. ఎంతంటే..!
నేటి నుండి దేశ వ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు తగ్గాయి. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్కతాలో రూ. 106.03 ఉండగా, చెన్నై లో రూ. 102.63 ఉంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు కొంతకాలంగా స్థిరంగా ఉండడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా ముడి చమురు ధర బ్యారెల్కు 95 డాలర్ల కంటే తక్కువగానే ఉంది. బ్రెంట్ ధర సోమవారం సాయంత్రం బ్యారెల్ ధర USD 92 వద్ద ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, అంతర్జాతీయ ముడి చమురు ధరలు మార్చిలో బ్యారెల్కు $139కి చేరుకున్నాయి.. 2008 నుండి అత్యధికం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆరు నెలలకు పైగా స్థిరంగా ఉన్న తర్వాత ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్ 7న చివరిసారిగా ధర తగ్గింది. తాజాగా దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
Next Story