Sat Nov 16 2024 16:17:05 GMT+0000 (Coordinated Universal Time)
బావిలో పెట్రోల్ రాగానే పండగ చేసుకున్నారు.. ఎక్కడి నుండి వచ్చిందంటే?
బావిలో నుంచి పెట్రోలు వాసన రావడంతో జనం ఒక్కసారిగా షాక్
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలోని ఓ బావిలో కొద్దిరోజుల క్రితం నీటికి బదులు పెట్రోల్ రావడం ప్రారంభించింది. గీడం నగర్లోని వార్డు నంబర్ 12లో బావిలో నీటికి బదులు పెట్రోల్ ఉన్నట్లు గుర్తించారు. భూమిలోంచి పెట్రోలు వస్తోందని జనం నమ్మారు, అయితే అది సమీపంలోని పెట్రోల్ పంపు నుంచి లీక్ అయిందని తేలడంతో షాక్ అయ్యారు.
బావిలో నుంచి పెట్రోలు వాసన రావడంతో జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వార్త దావానంలా వ్యాప్తి చెందడంతో, ప్రజలు బావిలోని పెట్రోల్ ను దోచుకోవడం ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు కూడా వచ్చి పెట్రోలు తీసుకోమని చెప్పారు. చివరికి పోలీసులకు ఈ విషయం తెలిదిండి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిని మూసివేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలను దూరప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో రోడ్లపై బారికేడ్లు వేసి వాహనాల రాకపోకలను ఆంక్షలు విధించారు. అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు.
అయితే ఓ పెట్రోల్ బంక్ యజమాని ఇంధనం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మా దంతేశ్వరి పెట్రోల్ పంప్లో 14 వేల లీటర్ల పెట్రోల్ చోరీకి గురైందని ఆ బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బావిలో పెట్రోలు బయటకు వచ్చిందనే విషయం తెలుసుకున్న తర్వాత చేసిన దర్యాప్తులో పెట్రోల్ ట్యాంక్లో లీకేజీ కారణంగా అది కాస్తా భూమిలో కలిసిపోయింది. దగ్గరలోని బావిలో నీళ్లకు బదులుగా పెట్రోల్ కనిపించింది. ట్యాంకు నుంచి 14 వేల లీటర్ల పెట్రోలు బావిలోకి చేరింది. బావిలో పెద్ద మొత్తంలో పెట్రోలు ఉన్నందున ఆ ప్రాంతంలో అధికారులు ఆంక్షలు విధించారు. నిపుణుల బృందాన్ని ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. పరిష్కారం ఏమిటా అని తలలు పట్టుకుంటూ ఉన్నారు.
Next Story