Mon Dec 23 2024 02:19:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మరో విమానానికి బాంబు బెదిరింపు
విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి తరలించి తనిఖీలు చేపడుతున్నారు
ఈరోజు మరో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి తరలించి తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జైపూర్ లో దించి...
విమానంలో ఉన్న ప్రయాణికులను దించి తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గత పది రోజుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వస్తుండటం, అధికారులు ఎయిర్‌పోర్టులోనే నిలిపి తనిఖీలు నిర్వహిస్తుండటంతో ప్రయాణంలో ఆలస్యం ఏర్పడుతుంది. దీనిని కట్టడి చేయడానికి విమానయాన శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది.
Next Story