Mon Dec 23 2024 14:27:21 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ ప్లీనరీకి అంతా సిద్ధం
కాంగ్రెస్ లో ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలపై ఈ ప్లీనరీ సమావేశాల్లో చర్చించనున్నారు.
కాంగ్రెస్ లో ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు రానున్న పలు రాష్ట్రాల ఎన్నికలపై ఈ ప్లీనరీ సమావేశాల్లో చర్చించనున్నారు. రాయపూర్ లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు జరగాల్సిన ప్రయత్నాలపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశముంది.
2024 ఎన్నికల్లో ...
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రతి రాష్ట్రంలో మంచి స్పందన రావడంతో తమతో కలసి వచ్చే పార్టీల సంఖ్య కూడా పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ ప్లీనరీ సమావేశాలకు మొత్తం పదిహేను వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీన రాయపూర్ లోనే భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story