Sun Dec 22 2024 22:27:34 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్: ఫిబ్రవరి 28, 2024న డబ్బులు వేయనున్న కేంద్రం
కేంద్రప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన
కేంద్రప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ఈ నెలాఖరులోగా లబ్ధి దారులకు చెల్లించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం గ్రహీతలకు అందజేస్తుందని పీఎం కిసాన్ వెబ్సైట్ పేర్కొంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం ప్రాథమిక లక్ష్యం పేద రైతులకు ఆదాయ వనరులను అందించడం. ఈ విధానంతో, రైతులకు సంవత్సరానికి రూ. 6000 అందించనుంది. రైతులకు సంవత్సరానికి రూ. 2000 చొప్పున మూడు వాయిదాలలో డబ్బులు అందుతాయి. ఆ సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పీఎం కిసాన్ పథకంలో రైతులు మాత్రమే అర్హులు.
పీఎం కిసాన్ 16వ విడుత నగదు పంపిణీని ఫిబ్రవరి 28, 2024న కేంద్రం రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీన, అర్హత కలిగిన లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ 16వ విడుత నగదు డిపాజిట్ అయ్యిందా? లేదా? అని తెలుసుకోడానికి అర్హులైన రైతులు https://pmkisan.gov.in/ Portal పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక పోర్టల్లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ ఎంపిక చేసుకోవాలి. పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేయాలి. ఆధార్ లేదా అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి.. గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
పీఎం కిసాన్ లో నమోదు చేసుకునే రైతులు ఈ కేవైసీ తప్పని సరి చేసుకోవాలి. ఈకేవైసీ పద్దతి పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రం రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బుల్ని డిపాజిట్ అవుతుంది. నవంబర్ 15, 2023న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 8 కోట్ల మంది రైతులకు రూ. 18,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) పథకం కింద పదిహేనవ విడత డబ్బును పంపిణీ చేశారు.
Next Story