Fri Nov 22 2024 17:45:37 GMT+0000 (Coordinated Universal Time)
Modi On Trump: నా స్నేహితుడిపై దాడి జరిగింది: ప్రధాని మోదీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్‌ను తన "స్నేహితుడు"గా ప్రస్తావిస్తూ.. ఈ హత్యాయత్నం పట్ల తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని చెప్పారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదన్నారు ప్రధాని మోదీ. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కాల్పుల ఘటనను హత్యాయత్నంగా దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ప్రకారం ట్రంప్ చెవి నుండి రక్తస్రావం అయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ అనుమానాస్పద షూటర్‌ను చంపినట్లు తెలిపింది. ర్యాలీ వేదికకు దగ్గరగా.. ఓ పైన ఉన్న ప్రాంతం నుండి దాక్కుని మరీ ఈ దాడి చేసినట్లు చెప్పారు.
Next Story