Mon Dec 23 2024 18:07:37 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ కు ప్రధాని అభినందనలు
ర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని, బీజేపీ కార్యకర్తల కృషిని
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
అదేవిధంగా బీజేపీ కి మద్దతుగా నిలిచి, బీజేపీ కోసం కృషి చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని, బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నానని, రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తామని ప్రధాని మోదీ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా.. మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. నేడు వాటి ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాల మాదిరిగానే కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 136, బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించాయి.
Next Story