Mon Dec 23 2024 15:13:50 GMT+0000 (Coordinated Universal Time)
మహీంద్రా స్కార్పియో నుండి.. మెర్సిడెస్-మేబ్యాక్ S 650 గార్డ్ వరకూ.. ప్రధాని మోదీ వాడిన కార్లివే
భారత ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ లో ఏయే కార్లు ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మహీంద్రా స్కార్పియో నుండి.. మెర్సిడెస్-మేబ్యాక్ S 650 గార్డ్ వరకూ
భారత ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ లో ఏయే కార్లు ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఒకప్పుడు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్ మహీంద్రా స్కార్పియో వాహనాన్ని వాడుతూ ఉండేవారు. ఆ తర్వాత BMW 7 సిరీస్ హై-సెక్యూరిటీ ఎడిషన్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్కి మారారు. ఇప్పుడు సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ S 650 గార్డ్ కు ప్రధాని వాహనం అప్ గ్రేడ్ అయింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇటీవల స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు వచ్చినప్పుడు ఓ కొత్త కారులో మోదీ రావడాన్ని గమనించారు. ఈ కారు ఏమిటా అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఈ సాయుధ మేబ్యాక్ S 650 గార్డ్ కారు VR10-స్థాయి రక్షణతో(ఎక్స్ ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ (ఈఆర్వీ) 2010 రేటింగ్) వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. రక్షణ పరంగా బుల్లెట్ల నుంచి ఈ కారు రక్షణ కల్పిస్తుంది. పేలుడు పదార్థాల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యమూ వుంది. రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్ టీ పేలుడు జరిగినా కారులోని వారికి ఏమీ అవ్వదు. గ్యాస్ దాడి జరిగితే కారు క్యాబిన్ నుంచి ప్రత్యేకంగా ఆక్సిజన్ సరఫరా అవుతుంది.
పేలుడు వంటి దాడి కారణంగా దెబ్బతిన్నా కానీ పనిచేసేలా ఫ్లాట్ టైర్లు ఏర్పాటు చేశారు. కారుకు ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్లు కూడా ఉన్నాయి, ఇవి డ్యామేజ్ అయినప్పుడు లేదా పంక్చర్ అయినప్పుడు త్వరితగతిన తప్పించుకోవడానికి వీలుగా పని చేస్తూనే ఉంటాయి. సీట్ మసాజర్లతో కూడిన ఖరీదైన ఇంటీరియర్‌తో సహా ఇతర సౌకర్యాలు ప్రామాణిక మేబ్యాక్ S-క్లాస్ నుండి అందించబడతాయి. సీట్లు లెగ్‌రూమ్ కోసం రీపొజిషన్ చేయబడ్డాయి. 6.0-లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజిన్ కలిగిన కారు ఇది. 516 bhp మరియు 900 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. టాప్ స్పీడ్ 160 కిలోమీటర్లు కాగా.. ఈ కారు ధర 12 కోట్ల రూపాయలు.
Next Story