Mon Dec 23 2024 16:41:27 GMT+0000 (Coordinated Universal Time)
మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ..
దేశంలోనే సూపర్ ఫాస్ట్ మెట్రో ప్రాజెక్ట్ గా కాన్పూర్ అవతరించిందని ప్రధాని పేర్కొన్నారు. కాన్పూర్ మెట్రో ప్రాజెక్టును మొత్తం 32 కిలోమీటర్ల మేర విస్తరింపజేయాల్సి ఉండగా..
ప్రతిష్టాత్మక కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. మంగళవారం కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. మెట్రో రైలుతో పాటు బినా పంకీ మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్ట్ విభాగాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం 9 కిలోమీటర్ల పొడవు అంటే.. ఐఐటీ కాన్పూర్ నుంచి మోతీ జీల్ వరకూ విస్తరించి ఉంది.
సూపర్ ఫాస్ట్ మెట్రో ప్రాజెక్ట్ గా కాన్పూర్
దేశంలోనే సూపర్ ఫాస్ట్ మెట్రో ప్రాజెక్ట్ గా కాన్పూర్ అవతరించిందని ప్రధాని పేర్కొన్నారు. కాన్పూర్ మెట్రో ప్రాజెక్టును మొత్తం 32 కిలోమీటర్ల మేర విస్తరింపజేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 9 కిలోమీటర్ల వరకే ప్రాజెక్టు పూర్తయింది. మిగతా పనులను రూ.11 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. కాన్పూర్ మెట్రో ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి ముందు.. ప్రధాని ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ 54వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు.
విద్యార్థుల వల్లే దేశ అభివృద్ధి
రాబోయే యుగం విద్యార్థులకు సువర్ణావకాశమన్న ఆయన.. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్ గా అవతరించిందని పేర్కొన్నారు. ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థుల వల్లే ఇది సాధ్యమైందని మోదీ కొనియాడారు. కాలేజీ నుంచి బయటికి అడుగుపెట్టే విద్యార్థులు తమకు అనుకూలమైన దిశగా కాకుండా.. ఛాలెంజ్ లను ఎదుర్కొనే దిశగా పయనించాలని సూచించారు. అప్పుడే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని ప్రధాని హితవు పలికారు.
Next Story