Mon Dec 23 2024 08:11:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మన్ కీ బాత్ లో ఏపీ మహిళ పాడిన పాట
సమాజబలంతో దేశబలం పెరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ సాంప్రదాయ క్రీడలను..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు (ఫిబ్రవరి 26) నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏపీకి చెందిన మహిళ టి.విజయదుర్గ పాడిన పాటను వినిపించారు. ఈ సారి దేశభక్తియుత పాటలు పాడిన వారి గురించి మాట్లాడిన ప్రధాని.. తెలుగులో పాటను రాసి పంపించిన ఏపీకి చెందిన స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డిపై టి.విజయ దుర్గ అనే మహిళ పాడిన 27 సెకన్ల ఆడియో క్లిప్ని అందరికీ వినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరంతా ‘మన్ కీ బాత్’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని అన్నారు.
సమాజబలంతో దేశబలం పెరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ సాంప్రదాయ క్రీడలను గురించి మాట్లాడిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుందన్నారు. అలాగే భారతీయ బొమ్మల గురించి చర్చించినప్పుడు, దేశ ప్రజలు దానిని హృదయపూర్వకంగా ప్రోత్సహించారు. ఇప్పుడు భారతీయ బొమ్మలకు విదేశాల్లోనూ డిమాండ్ పెరిగిందన్నారు. హోలీ గురించి మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో హోలీ పండుగ రాబోతోంది. మనమంతా వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో మన పండుగలను జరుపుకోవాలని ప్రధాని మక్ కీ బాత్ లో పిలుపునిచ్చారు.
Next Story