Mon Dec 23 2024 01:20:33 GMT+0000 (Coordinated Universal Time)
అరుదైన గౌరవం.. ప్రధానితో కలిసి వేదిక పంచుకోనున్న రామ్ చరణ్
అయితే.. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న తర్వాత చరణ్ పాల్గొంటున్న తొలి కార్యక్రమం ఇదే..
ఆర్ఆర్ఆర్ క్రేజ్.. ఆస్కార్ తో మరింత రెట్టింపైంది. ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆస్కార్ అందుకున్నాక తిరిగి స్వదేశానికి వచ్చిన ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. తాజాగా రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం అందుకోనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేదిక పంచుకోనున్నారు. రెండు రోజుల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ లో వీరిద్దరూ పాల్గొననున్నారు. ఈ వేదికపైనే ప్రధాని మోదీ చరణ్ ను మర్యాదపూర్వకంగా సత్కరించనున్నట్లు తెలుస్తోంది.
మార్చి 17,18 తేదీల్లో ఢిల్లీలో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఇండియా టుడే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా హాజరుకానున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న తర్వాత చరణ్ పాల్గొంటున్న తొలి కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ లు చరణ్ ను సత్కరిస్తారని, అనంతరం చరణ్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. నటుడిగా తన ప్రయాణం, ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విధానం, గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడం, ఆస్కార్ గెలుచుకోవడం వంటి విషయాలను చరణ్ వివరించనున్నారు.
Next Story