Sun Dec 22 2024 15:55:28 GMT+0000 (Coordinated Universal Time)
National creators award:'మినీ స్కర్ట్స్' గురించి వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
చాలా మంది ప్రజలు మినీ స్కర్ట్‌లను ఆధునికతకు చిహ్నంగా భావిస్తారని.. కానీ మీరు కోణార్క్‌కు వెళితే
National creators award:మినీ స్కర్ట్స్ వేసుకుంటే ఏదో తప్పు చేసేశారన్నట్లుగా చూసే వాళ్లు ఇంకా మన మధ్యనే ఉన్నారు. అది భారతీయ సంస్కృతి కాదని కూడా కొందరు వాదిస్తారు. మోడర్న్.. ఫ్యాషన్ అంటూ పలువురు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మినీ స్కర్ట్‌లకు.. ప్రాచీన భారతీయ కళాత్మకతకు మధ్య ఉన్న ఒక సంబంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.
"చాలా మంది ప్రజలు మినీ స్కర్ట్‌లను ఆధునికతకు చిహ్నంగా భావిస్తారని.. కానీ మీరు కోణార్క్‌కు వెళితే, శతాబ్దాల నాటి దేవాలయాలలో మినీ స్కర్టులు, వారి చేతుల్లో పర్సులు ధరించి ఉన్న విగ్రహాలను మీరు చూస్తారు." అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అవార్డు గ్రహీతలలో 19 ఏళ్ల కంటెంట్ సృష్టికర్త జాన్వీ సింగ్ కూడా ఉన్నారు. జాన్వీ సింగ్‌కు హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును అందించిన తర్వాత నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కోణార్క్‌లోని సూర్య దేవాలయం వద్ద సమకాలీన ఫ్యాషన్ పోకడలు, పురాతన శిల్పాల మధ్య పోలికల గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. వందల ఏళ్ల క్రితమే ఆ శిల్పులకు కోణార్క్ లో అలాంటి వాటిని చెక్కారని.. ఫ్యాషన్ అంటే ఏమిటో అప్పటి వాళ్ళకే తెలుసునేమో అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ రెడీమేడ్ దుస్తులను ఎంచుకునే ప్రస్తుత ట్రెండ్ గురించి కూడా మాట్లాడారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ దుస్తులను మరింత బలంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ మార్కెట్లో భారతీయ ఫ్యాషన్‌కు మంచి అవకాశం ఉందని, భారతదేశ విశిష్ట సాంస్కృతిక గుర్తింపును ప్రపంచానికి చాటిచెప్పే సంప్రదాయ దుస్తులపై మళ్లీ దృష్టి పెట్టాలని సూచించారు.
Next Story