Mon Dec 23 2024 02:25:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోజు అయోధ్యకు రావద్దని చెప్పేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించారు. అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించారు. అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు మోదీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి ఆరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రధాని ప్రారంభించారు. అయోధ్యలో అడుగుపెట్టిన ప్రధానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు తమ ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి అయోధ్య ధామ్ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో కలిసి అయోధ్య ధామ్ స్టేషన్ ను మోదీ ప్రారంభించారు.
అయోధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. జనవరి 22 న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అంతా కోరుకుంటారని.. కానీ అది అందరికీ సాధ్యపడదని తెలిపారు. జనవరి 22 వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా ఆ రోజున భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23 వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని మోదీ సూచించారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీ చరిత్రలో విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ రోజున దేశంలోని ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత దేశ చరిత్రలో జనవరి 22 వ తేదీ విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని.. ఆ రోజు రాత్రి దేశంలోని ప్రతి ఇంటా రామ జ్యోతి వెలిగించాలని సూచించారు.
Next Story