Fri Dec 20 2024 11:45:27 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను తల్లిని చేసేందుకు ఖైదీకి బెయిలిచ్చిన కోర్టు
గతంలో మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో పలు సెక్షన్లు, పోక్సో చట్టం కింద కోర్టు దోషిగా నిర్ధారించి.. 20 ఏళ్లు
జీవితఖైదీకి భార్య అయిన ఓ మహిళ హైకోర్టును విచిత్ర కోరిక కోరింది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన వంశం వృద్ధి చెందాలని.. అందుకు తనకు అవకాశం కల్పించాలంటూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. మహిళ పిటిషన్ ను విచారించిన కోర్టు.. అందుకు అంగీకరించడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల రాహుల్ అనే వ్యక్తి అత్యాచార కేసులో అల్వార్ సెంట్రల్ జైల్లో జీవితఖైదును అనుభవిస్తున్నాడు.
గతంలో మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో పలు సెక్షన్లు, పోక్సో చట్టం కింద కోర్టు దోషిగా నిర్ధారించి.. 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండేళ్లుగా రాహుల్ జైల్లో ఉన్నాడు. కాగా.. జైలుకు వచ్చే ముందే అతనికి వివాహమయింది. తాజాగా అతని భార్య.. రాహుల్ పెరోల్ పిటీషన్ ను రాజస్థాన్ కోర్టుకు సమర్పించింది. ఆ పిటిషన్ ను జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైనల్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారిచింది. తన వంశవృద్ధి కోసం తన భర్తను బెయిల్ పై విడుదల చేయాలని కోర్టును కోరింది.
మహిళ తన వంశ పరిరక్షణ కోసమే పిటీషన్ దాఖలు చేసిందని, పిటీషన్ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్లే అవుతుందన్న కోర్టు.. దోషికి 15రోజులు పెరోలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. రూ.2లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి బెయిల్ పొందవచ్చని తెలిపింది.
Next Story